బల్దియాపై ఎగిరేది గులాబీ జెండానే: బోడకుంటి వెంకటేశ్వర్లు

17
bodakunti

సీఎం కేసీఆర్,టీఆర్ఎస్‌పై బీజేపీ ఎంపీలు వాడుతున్న పరుష పదజాలాన్ని ఖండిస్తున్నాం అని తెలిపారు ప్రభుత్వ చీఫ్ విప్ బోడకుంటి వెంకటేశ్వర్లు.తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడిన ఆయన …పార్లమెంటు సభ్యులు అయి ఉండి గల్లీ లీడర్ల కన్నా హీనంగా ప్రవర్తిస్తున్నారని చెప్పారు.

బీజేపీ అధిష్టానం వాళ్లకు నేర్పిన సంస్కారం ఇదేనా ?…హైదరాబాద్ ప్రజలు విజ్ఞత తో ఆలోచించి బీజేపీ కి బుద్ధి చెబుతారని తెలిపారు. టీఆర్ఎస్ టిక్కెట్లు కేటాయించిన తీరు ను అందరూ హర్షిస్తున్నారు…బల్దియా పై ఎగిరేది గులాబీ జెండా నే అని స్పష్టం చేశారు.