మరింత తగ్గిన బంగారం ధరలు..

69
gold rate

బంగారం ధరలు మరింత తగ్గుముఖం పట్టాయి. వరుసగా మూడోరోజు బంగారం ధఱలు తగ్గగా హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర. 300 తగ్గి రూ.47,000కి చేరగా 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.290 తగ్గి రూ.51,340కి చేరింది. బంగారం బాటలోనే వెండి కూడా భారీగా తగ్గుముఖం పట్టింది. కిలో వెండి ధర రూ.1600 తగ్గి రూ.66,700కి చేరింది. అంతర్జాతీయంగా బంగారం ధరలకు డిమాండ్ తగ్గడంతో దేశీయంగా ధరలు తగ్గుముఖం పట్టాయి.