రాష్ట్రంలో కాంగ్రెస్ అస్థిత్వం కోల్పోయింది: ఎమ్మెల్సీ బాలసాని

376
mlc balasani
- Advertisement -

రాష్ట్రంలో కాంగ్రెస్ అస్థిత్వం కొల్పోయిందన్నారు ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ. పీసీసీ చీఫ్ ను నియమించుకోలేని దుస్థితిలో కాంగ్రెస్ ఉందని ఎద్దేవా చేసిన ఆయన …నాయకత్వ లేమి , అసమర్థ నాయకత్వం తో కాంగ్రెస్ అవస్థ పడుతుందని విమర్శించారు. ఎవరు పీసీసీ కావాలని పోటి పడుతున్నారు…కాంగ్రెస్ నేతలు పోటీ పడి పాదయాత్ర , పోరు బాట , శవయాత్ర చేస్తున్నారని దుయ్యబట్టారు.

నీ పార్టీ ని నువ్వు సరిదిద్దుకో లేవు గానీ మా టీఆర్ఎస్ పార్టీ ని విమర్శిస్తవా..?…నీకు నాయకత్వ లక్షణాలు ఉన్నాయా.? కాంగ్రెస్ పార్టీ కి క్రమశిక్షణ ఉందా అని ప్రశ్నించారు. ఒక ఎకరానికి నీళ్లు ఇవ్వలేదని భట్టి పచ్చి అబద్దాలు మాట్లాడుతున్నారు ..కళ్లలేని కబోదిలా భట్టి మాట్లాడుతున్నావు అని మండిపడ్డారు.పీసీసీ దక్కదేమోనని కాంగ్రెస్ నేతలు మాట్లాడుతున్నట్లు ఉందని….కాంగ్రెస్ హయాంలో ఎంత పంట పండింది.. కేసీఆర్ సీఎం అయ్యాక ఎంత పడిందో చెప్పాలన్నారు.

భారత దేశంలో అత్యదిక పండించిన రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం….18 లక్షల ఎకరాల పైన కొత్తగా నీళ్లు ఇచ్చాం అన్నారు. సూర్యపేట కాలువల్లో కాళేళ్వరం నీకు కనిపించవా..?? …భట్టి మాటలు పచ్చి అబద్దాలు. దిగజారిన మనిషి అని మండిపడ్డారు. పోరుబాట, పొలంబాట కాదు కాంగ్రెస్ పార్టీ ది ఇంటిబాటే అన్నారు. అభివృద్ధి గురించి భట్టి కేం తెలుసు .. నల్ల అద్దాలు పెట్టుకోని కారులో ప్రయాణం చేస్తే ఏం తెలుస్తుంది భట్టి .. పొలంలో దిగు , కాలువలు చూడు నీళ్లు కనిపిస్తాయన్నారు.

60 వేల కోట్లకు మించి కాళేశ్వరం ప్రాజెక్టు కు ఖర్చు కాలేదని నేను సవాల్ చేస్తున్నా .. ఇది అబద్దమని నిరూపిస్తే నేను రాజకీయ సన్యాసం చేస్త. నువ్వు సిద్దమా ..? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ ది, భట్టి విక్రమార్క ది అవినీతి చరిత్ర…భట్టి స్థాయి మరచి మాట్లాడుతున్నారు .. దిగిజారి మాట్లాడుతున్నారన్నారు. ఏ అభివృద్ధి పని జరిగినా భట్టికి కప్పం కట్టాల్సిందే….. కొబ్బరి కాయ కొట్టాలంటే భట్టికి కమిషన్ ముట్టాల్సిందేనన్నారు.

- Advertisement -