నందమూరి ఆర్ట్స్ పతాకం కళ్యాణ్ రామ్ హీరోగా తెరకెక్కిన చిత్రం ఎమ్మెల్యే. కల్యాణ్ రామ్ సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటించగా ఉపేంద్ర మాధవ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. మార్చి 23న ప్రేక్షకుల ముందుకు రానుండగా సినిమా ప్రమోషన్‌లో బిజీగా ఉంది చిత్రయూనిట్. ఇప్పటివరకు ఒక్కొక్కటిగా సాంగ్స్‌ను విడుదల చేస్తున్న చిత్రయూనిట్ తాజాగా థియేట్రికల్ ట్రైలర్‌ను విడుదల చేశారు.
మా ఊర్లో అందరు నన్ను మంచి లక్షణాలున్న అబ్బాయి అని పిలుస్తారు…దానినే షార్ట్ ఫామ్‌లో ఎమ్మెల్య అంటారు అంటూ మొదలయ్యే టీజర్‌లో లవ్,ఎమోషన్,పాలిటిక్స్ తో ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ వస్తోంది. నేను ఇంకా రాజకీయం చేయడం మొదలు పెట్టలేదు మొదలు పెడితే మీరు చేయడానికి ఇంకా ఏం ఉండదు అని కల్యాణ్ రామ్ చెప్పిన డైలాగ్ అందరిని ఆకట్టకుంది. ఏ మావగారైనా పిల్లతో పాటు కట్నం ఇస్తారు. నా మామగారేంటో నాకు బావమరిదిని ఇచ్చారు అని వెన్నెల కిషోర్ చెప్పే డైలాగ్ ఫన్నీగా అనిపిస్తుంది. కళ్యాణ్ రామ్ పక్కా పొలిటికల్ డ్రామాతో అలరించనున్నట్లు ట్రైలర్ చూస్తే అర్దమవుతోంది.