విశ్వరూపం 2….సెన్సార్ పూర్తి

236
Vishwaroopam 2 aims for June release
- Advertisement -

అత్యంత భారీ బడ్జెట్ తో విలక్షణ నటుడు కమల్ హాసన్ నట విశ్వరూపం చూపించిన సినిమా విశ్వరూపం. కమల్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం కోసం ఫస్ట్ పార్ట్‌కు మించి తెగకష్టపడ్డాడు కమల్. నాలుగేళ్లుగా ఈ సినిమా కోసం నానా తంటాలు పడుతున్నా విడుదలకు మాత్రం నోచుకోలేకపోయింది.

తాజాగా సెన్సార్ కార్య‌క్ర‌మాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం విడుదలకు లైన్ క్లియరైంది. యు/ఏ సర్టిఫికెట్ పొందిన ఈ చిత్రం డబ్బింగ్ పనులు శరవేగంగా జరుపుకుంది. యూఎస్ లో పోస్ట్ ప్రొడక్షన్స్ పనులు పూర్తిచేసుకున్న ఈ చిత్రం జూన్‌లో విడుదల కానుంది. తెలుగు, తమిళం, హిందీ భాషలలో విడుదల కానుండగా రాహుల్ బోస్, పూజా కుమార్,ఆండ్రియా, నాజ‌ర్‌ ప్రధాన పాత్రల్లో నటించారు.

కమల్ పొలిటికల్ ఎంట్రీకి తోడు అవినీతితో పాటు కొన్ని సంఘ‌ట‌న‌లకి సంబంధించిన సీన్స్ ఈ సినిమాలో ఉండనుండటంతో ఆసక్తి రేపుతోంది. త్వ‌ర‌లోనే చిత్ర ట్రైల‌ర్ విడుద‌ల చేయ‌నున్నారు.

- Advertisement -