బంగారు తెలంగాణ.. ఇదే నిదర్శనం..

213
MLA Sunke RaviShankar
- Advertisement -

బంగారు తెలంగాణలో ముందడుగు అనడానికి ఇది ఒక నిదర్శనం. ముఖ్యమంత్రి కేసీఆర్ కలలుకన్న బంగారు తెలంగాణ సాకారం అయ్యిందని చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ అన్నారు. మంగళవారం కొడిమ్యాల మండలం తిర్మలాపూర్ రైతు వేదికను మంత్రి కొప్పులతో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ…నేను పుట్టిన ఊరు నారాయణపూర్ జలాశయం నుండి మైసమ్మ చెరువు,పోతారం జలాశయాలు నింపడం ద్వారా నియోజకవర్గంలోని ఆరు మండలాల్లో గతంలో కంటే సుమారు 40వేల ఎకరాల్లో వరిసాగు విస్తీర్ణం పెరిగిందన్నారు. బంగారు తెలంగాణలో ముందడుగు అనడానికి ఇది ఒక నిదర్శనం. ముఖ్యమంత్రి కేసీఆర్ కలలుకన్న బంగారు తెలంగాణ సాకారం అయ్యిందని మధ్యమానేరు జలాశయ సందర్శనలో తెలిపారు ఎమ్మెల్యే గుర్తు చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అవకాశం ఇవ్వడం, ప్రజలు ఆశీర్వదించి నన్ను భారీ మెజారిటీతో గెలిపించడం,నీళ్ళతో పులికించి పోతున్న చొప్పదండి నియోజకవర్గానికి నేను ఎమ్మెల్యేగా ఉండటం అదృష్టంగా భావిస్తున్నానని తెలిపారు.ముఖ్యమంత్రి కేసీఆర్ దిశానిర్దేశాన్ని పాటిస్తు చొప్పదండి నియోజకవర్గాన్ని కోనసీమగా మార్చే ప్రయత్నంలో నా వంతు పోషిస్తానని ఎమ్మెల్యే తెలిపారు.

కేసీఆర్ సూచించిన విధంగా చొప్పదండి నియోజకవర్గానికి 14 చెక్ డ్యాంలు మంజూరు అయ్యాయి. ఒక్క రామడుగు మండలంలో 6 చెక్ డ్యాంలు మంజూరు అయ్యాయని తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. గతంలో రైతులు నీళ్ళు లేక తమకు సరిపడినంత పంటను పండించలేకపోయేవారు.కానీ నేడు ముఖ్యమంత్రి కేసీఆర్ అపర భగీరథ ప్రయత్నం వల్ల భూమికి బరువయ్యే పంటలు పండుతున్నాయి. నిండు ఎండాకాలం సైతం చెరువులు మత్తడి దుంకడం ముఖ్యమంత్రి కేసీఆర్ అపర భగీరథ ప్రయత్నానికి, కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ ప్రతిఫలానికి నిదర్శనం. ఈ చెక్ డ్యాంల నిర్మాణం ద్వారా భూమిలో నీటి నిల్వలు పెరుగుతాయి. దానిద్వారా బావుల్లో చెరువుల్లో ఎప్పుడూ నీళ్లు ఉంటాయి. కేవలం మూడు సంవత్సరాల్లో సుమారు 80వేల కోట్లతో కాలేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేసి సుమారుగా కోటి మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి రావడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ భగీరథ ప్రయత్నమే అని కొనియాడారు.

కేసీఆర్ ముఖ్యమంత్రి కాకముందు రైతుల ఆత్మహత్యలు ఉండేటివి. బోర్లు వేసి బోర్ల పడ్డ సందర్భాలు అనేకం. ఎరువులు,విత్తనాల కోసం లైన్లో నిలబడినటువంటి పరిస్థితి ఉండేది. నాణ్యమైన విద్యుత్తు ఉండేది కాదు. రాత్రిపూట 4గంటలు పొద్దున పూట మూడు గంటలు కరెంటు ఇవ్వడం వల్ల రాత్రిపూట పొలాల వద్దకు వెళ్లి పాముకాటుకు గురై చనిపోయిన రైతుల ఎందరో ఉన్నారు. కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడి కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత రైతులకు 24 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్తును అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. రైతుబంధు పథకం ద్వారా ఎకరానికి సంవత్సరానికి 10,000 రూపాయలు అందిస్తున్న రాష్ట్రం తెలంగాణ. దేశంలో ఏ రాష్ట్రం కూడా ఇంత పెద్ద ఎత్తున రైతు సహాయం అందించడం లేదు. రైతు బీమా పథకం ద్వారా రైతులకు రాష్ట్ర ప్రభుత్వమే భీమా చెల్లించి రైతు ఏదైనా ప్రమాదంలో చనిపోతే ఐదు లక్షల రూపాయల ఉచిత బీమా ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం దేశం మొత్తానికి అన్నపూర్ణ రాష్ట్రంగా మారిందని ఎమ్మెల్యే రవిశంకర్‌ పేర్కొన్నారు.

- Advertisement -