వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లపై కేబినెట్ సబ్ కమిటీ భేటీ..

68
ktr

నాన్ అగ్రికల్చర్ ప్రాపర్టీస్ రిజిస్ట్రేషన్లపై ఏర్పాటైన క్యాబినెట్ సబ్ కమిటీ మంగళవారం బిఆర్కే భవన్ లో భేటి అయింది. ఈ సమావేశంలో సబ్ కమిటీ చైర్మన్ రాష్ట్ర రోడ్లు-భవనాలు,గృహ నిర్మాణ మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, సభ్యులు మున్సిపల్ మరియు ఐటి, ఇండస్ట్రీ శాఖ మంత్రి కెటి రామారావు, హోం మంత్రి మహమూద్ అలీ,పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు, పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, సీఎస్ సోమేశ్ కుమార్, పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

సుదీర్ఘంగా జరిగిన ఈ భేటీలో మంత్రులు పలు అభిప్రాయాలు వ్యక్తం చేశారు. టెక్నికల్ అంశాలపై సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు. క్యాబినెట్ సబ్ కమిటీలో చర్చకు వచ్చిన అంశాలను సబ్ కమిటీ చైర్మన్ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మీడియా సమావేశంలో వెల్లడించారు. మీడియా సమావేశంలో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ… అన్ని క్రయవిక్రయాల దస్తావేజులు పారదర్శకంగా జరగాలని,ప్రజలకు సులభతరంగా అర్ధమయ్యే రీతిలో ఉండాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. అందులోభాగంగా ఐదుగురు మంత్రులతో రిజిస్ట్రేషన్లపై వేసిన క్యాబినెట్ సబ్ కమిటీ ఇవాళ భేటి అయ్యింది. అవినీతికి ఆస్కారం లేకుండా..ప్రజలు తమంతట తామే రిజిస్ట్రేషన్ చేసుకునేలా ధరణి పోర్టల్ ముఖ్యమంత్రి ప్రారంభించారని మంత్రి తెలిపారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలకు అనుగుణంగా సీఎస్ సోమేశ్ కుమార్, అధికారులు 100 రోజులు నిర్విరామంగా అహోరాత్రులు కష్టపడ్డారు. అవిశ్రాంతంగా కృషి చేశారు. దేశంలో ఎక్కడా లేని విధంగా పారదర్శకంగా ఉండే చరిత్రాత్మకమైన మంచి పోర్టల్ ను తీసుకు వచ్చారు. వారికి ప్రభుత్వం పక్షాన, తెలంగాణ ప్రజల పక్షాన శుభాకాంక్షలు, అభినందనలు అని మంత్రి తెలిపారు. చిన్న చిన్న అవరోధాలు అధిగమిస్తూ ముందుకు పోతున్నాం. రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ కు ఊతమిచ్చే విధంగా ప్రభుత్వం కృషి చేస్తున్నది. సూచనలు, సలహాలు తీసుకుని అత్యంత సులభంగా రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేయాలని భావిస్తున్నామన్నారు. ప్రజల నుంచి వివిధ వర్గాల నుంచి వస్తున్న సూచనలను క్రోడీకరిస్తున్నాం. అతి తొందరలోనే అవరోధాలు అదిగామిస్తాం. బాగా డిమాండ్ ఉన్న రిజిస్ట్రేషన్ కార్యాలయాలు. తక్కువ రిజిస్ట్రేషన్ అయ్యే కార్యాలయాలుగా వర్గీకరించాము. పని లేని దగ్గర నుంచి పని ఉన్న రిజిస్ట్రేషన్ ఆఫీసుకు సబ్ రిజిస్ట్రార్ లను,ఆపరేటర్ లను మారుస్తాం. త్వరలోనే పెండింగ్ లో ఉన్న డాక్యుమెంట్లు పూర్తి చేస్తామని మంత్రి స్పష్టం చేశారు.

ఇప్పుడు ఇస్తున్న డాక్యుమెంట్ పేపర్లు విషయంలో బ్యాంకర్లు అపోహలకు పోవద్దు. డీజీపీఏ ప్రొవిజన్‌ను రేపు లేదా ఎల్లుండి ఇంట్రడ్యూజ్ చేస్తాం. జీపీఏ, ఎస్‌పీఏ, మార్టిగేట్ లను తొందరలోనే అందుబాటులో తెస్తాం. ఒక్క డాక్యుమెంట్లులోనే ఇద్దరు,ముగ్గురు.. 17వ తేదీన ఉదయం 10గంటలకు స్టేక్ హోల్డర్స్ తో ఎంసీఆర్‌ హెచ్‌ఆర్‌డీలో వర్క్ షాప్ నిర్వహిస్తాం. ఇందుకు అధికారులను మూడు గ్రూప్స్ గా విభజించాము. 1.చట్ట పరమైన ఇబ్బందులకు ఒక బృందం, 2.సాంకేతిక సమస్యలు మరో బృందం, 3.క్షేత్ర స్థాయిలో పర్యవేక్షణకు మరో బృందం అధికారులు ఉంటారు. దీంతో వారంలో సమస్యలను అధిగమిస్తాం. మొదట్లో అన్నింట్లో ఇబ్బందులు ఉంటాయి. వాటన్నింటినీ దాటుకుని సౌలభ్యంగా రిజిస్ట్రేషన్లు చేస్తామని మంత్రి వెల్లడించారు. ఇప్పటికే ఓపెన్ ల్యాండ్ రిజిస్ట్రేషన్లు అవుతున్నాయి. ఎలాంటి ఇబ్బంది లేదు. టి-పిన్ నంబర్ అనేది యినిక్ నంబర్. టి-పిన్ నంబర్ తప్పుడు రిజిస్ట్రేషన్లు కాకుండా, అవకతవకలు జరుగకుండా ఉండేందుకు తీసుకువచ్చాము. సీఎం కేసీఆర్ నాయకత్వంలోని ప్రజా సంక్షేమ ప్రభుత్వం.. ప్రజలకు సులభతరంగా, అందుబాటులో ఉండేవిధంగా పనిచేస్తుందని మంత్రి ప్రశాంత్‌ రెడ్డి వివరించారు.