గ్రీన్ ఛాలెంజ్‌లో పాల్గొన్న బీదర్ ఎమ్మెల్యే శరణు సాలగర్..

376
MLA Sharanu Salagar
- Advertisement -

రాజ్యసభ సభ్యులు ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా ఈరోజు కర్ణాటక రాష్ట్రంలోని బీదర్ జిల్లా బసవకళ్యాణ నియోజకవర్గ ఎమ్మెల్యే శరణు సాలగర్ మొక్కలు నాటారు. ఎంపీ సంతోష్ కుమార్ పిలుపు మేరకు గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ను స్వీకరించి ఆయన ఈ రోజు 350కి పైగా మొక్కలను నాటారు.

టీఆర్‌ఎస్‌ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ చొరవతో గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ కార్యక్రమంలో పాల్గొనడం జరిందన్నారు.. ఇంత మంచి కార్యక్రమంలో భాగస్వామ్యం చేసినందుకు ఎంపీ సంతోష్‌కు ధన్యవాదలు అని ఎమ్మెల్యే శరణు సాలగర్ తెలిపారు. అలాగే ఈ గ్రీన్‌ ఛాలెంజ్‌ స్పూర్తిగా తీసుకొని నగరమంతా మొక్కలు నాటాలని సంబంధిత అధికారులకు సూచించారు.

- Advertisement -