తెలుగమ్మాయి శిరీష బండ్ల అంతరిక్ష యాత్ర షురూ..

96

వర్జిన్ గెలాక్టిక్ అంతరిక్ష యాత్ర ప్రారంభమైంది. భారత కాలమానం ప్రకారం ఈ సాయంత్రం 6.30 గంటలకు యూనిటీ 22 వ్యోమనౌకతో కూడిన వాహకనౌక నింగికి ఎగరనుంది. దీంట్లో వర్జిన్ గెలాక్టిక్ అధిపతి సర్ రిచర్డ్ బ్రాన్సన్ (70) తో పాటు నలుగురు వ్యోమగాములు ప్రయాణిస్తున్నారు. వారిలో భారత సంతతి తెలుగమ్మాయి శిరీష బండ్ల కూడా ఉన్నారు. అంతరిక్ష పర్యాటకాన్ని ప్రోత్సహించే ఉద్దేశంతో ఈ అరుదైన రోదసియాత్ర చేపడుతున్నారు. కాగా, దీన్ని లైవ్ లో తిలకించేందుకు వర్జిన్ గెలాక్టిక్ ఏర్పాట్లు చేసింది.

కంపెనీ వెబ్‌సైట్ virginatlantic.com లో ఈ లైవ్ టెలికాస్ట్ చూసే అవ‌కాశం క‌ల్పించారు. వ‌ర్జిన్ గెలాక్టిక్ ట్విట‌ర్‌, యూట్యూబ్‌, ఫేస్‌బుక్ చానెళ్ల‌లో కూడా దీనిని చూడొచ్చు. భూమికి 90 కిలోమీట‌ర్ల ఎత్తు వ‌ర‌కూ వీళ్లు వెళ్ల‌నున్నారు. అక్క‌డ కొన్ని నిమిషాల భార ర‌హిత స్థితిలో ఉన్న త‌ర్వాత తిరిగి భూమి వైపు ప్ర‌యాణం కానున్నారు. ఈ మొత్తం ప్ర‌యాణం 90 నిమిషాల్లో ముగుస్తుంద‌ని గ‌తంలో బ్రాన్స‌న్ వెల్ల‌డించారు.

WATCH LIVE: Virgin Galactic Unity 22 Spaceflight Livestream