ఆషాఢమాసం బోనాల ఉత్సవాలు ప్రారంభం..

156
- Advertisement -

హైదరాబాద్‌లో ఆషాఢమాసం బోనాల ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఆదివారం గోల్కొండలోని జగదాంబ ఎల్లమ్మ అమ్మవారికి తొలిబోనం సమర్పించడంతో నగరంతో పాటు రాష్ట్రమంతటా బోనాల ఉత్సవాలు మొదలు అయ్యాయి. ఆలయ కమిటీ అమ్మవారికి బంగారు బోనం సమర్పించింది. లంగర్‌హౌస్‌ నుంచి చేపట్టిన అమ్మవారి తొట్టెల ఊరేగింపు కార్యక్రమంలో మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, శ్రీనివాస్‌యాదవ్‌ పాల్గొన్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించి రాష్ట్ర ప్రభుత్వం తరపున అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు.

ఈ సందర్భంగా మంత్రి తలసాని మాట్లాడుతూ తెలంగాణ వచ్చిన తర్వాత బోనాల పండుగ ఘనంగా జరుగుతున్నదని చెప్పారు. భాగ్యనగరంలోని అన్ని ఆలయాలకు ప్రభుత్వం నిధులు మంజూరు చేసిందని తెలిపారు. తెలంగాణ ప్రజలు సంతోషంగా ఉన్నారని చెప్పారు. గతేడాది కరోనాతో పండుగ జరుపుకోలేకపోయామన్నారు. కరోనా నిబంధనలను పాటిస్తూ బోనాలు జరుపుకోవాలని మంత్రి తలసాని సూచించారు.

- Advertisement -