సీఎం కేసీఆర్ చేపట్టిన హరితహారం ప్రతిష్టాత్మకం..

146
Mla sathish kumar
- Advertisement -

హుస్నాబాద్ ఎమ్మెల్యే శ్రీ వొడితల సతీష్ కుమార్ జన్మదిన వేడుకలు బుధవారం హన్మకొండ హంటర్ రోడ్‌లోని వారి నివాసంలో ఘనంగా జరిగాయి. పలువురు టీఆరెస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, అధికారులు, అభిమానులు ఎమ్మెల్యే వొడితల సతీష్ కుమార్‌ని కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. జన్మదినోత్సవం సందర్బంగా ఎమ్మెల్యే వొడితల సతీష్ కుమార్ రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా తన ఇంటి ఆవరణలో మొక్కలు నాటారు.

గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా మానకొండూర్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్, సిద్ధిపేట జెడ్ పీ చైర్మన్ రోజా శర్మ లకు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ విసిరారు. తనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన, నియోజకవర్గంలో జన్మదినోత్సవాన్ని నిర్వహించిన టీఆరెస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, అభిమానులు, కార్యకర్తలకు ఎమ్మెల్యే వొడితల సతీష్ కుమార్ విలేకరులతో కృతజ్ఞతలు తెలిపారు.

ఈ సందర్బంగా ఎమ్మెల్యే సతీష్ కుమార్ మాట్లాడుతూ.. ఇటీవల కాలంలో వర్షాలు సమృద్ధిగా కురిసి చెరువులు, కుంటలు మత్తడి పడ్డాయని, రైతులు సంతోషంగా ఉన్నారని అన్నారు. హరితహారం కార్యక్రమాన్ని సిఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నారని, ప్రతి పల్లె, ప్రతి పట్టణంలో పచ్చదనం సంతరించుకోవాలన్నారు. ప్రజలంతా హరితహారంలో భాగస్వాములు కావాలని, మంచి పర్యావరణాన్ని భవిష్యత్ తరాలకు అందించాలని కోరారు. గ్రీన్ ఛాలెంజ్ కార్యక్రమం నిర్వహిస్తున్న రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ ని ఎమ్మెల్యే వొడితల సతీష్ కుమార్ ప్రత్యేకంగా అభినందించారు.

- Advertisement -