సివిల్స్ లో సత్తాచాటిన తెలంగాణ విద్యార్ధులు…

103
civils

సివిల్స్ ఫలితాల్లో తెలంగాణ విద్యార్థులు సత్తాచాటారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం గుండ్లబావి గ్రామానికి చెందిన ధాత్రి రెడ్డి IAS 46 వ ర్యాంకు సాధించగా సిద్దిపేట జిల్లా బీముని మల్లారెడ్డిపేట ,గంభీరావుపేటకు చెందిన మంద మకరంద్ సివిల్స్‌లో 110వ ర్యాంకు సాధించారు. అలాగే సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్ పట్టణానికి చెందిన పిన్నాని సందీప్ వర్మ కు యూపీఎస్సీ లో ఆలిండియా 244ర్యాంకు సాధించాడు.

ఐఎఫ్ఎస్ ఫలితాల్లో చౌటుప్పల్ మండలం తంగడపల్లి గ్రామ వాసి సత్తా చాటాడు. గ్రామానికి చెందిన బడేటి సత్య ప్రకాష్ గౌడ్ ఐఏఎస్ ఫలితాల్లో 218 ర్యాంక్ సాధించాడు. ఐఐటీ పాట్నాలో తన బీ.టెక్ ను 2018 లో పూర్తి చేశాడు. అప్పటి నుంచి సివిల్ పరీక్షలకు ఇంట్లో ఉండి ప్రిపేర్ అవుతున్నాడు. ఈ క్రమంలో సివిల్స్ రాసి మొదటి సారే 218 రాంక్ కైవసం చేసుకొని ఐపీఎస్ అధికారిగాగా ఎన్నిక కానున్నాడు .