రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ మరియు బిగ్ బాస్ షో ఫేమ్ భాను శ్రీ రెడ్డి ఇచ్చిన ఛాలెంజ్ ను స్వీకరించిన సినీ నటి, వైసీపీ ఎమ్మెల్యే రోజా గణతంత్ర దినోత్సవం సందర్భంగా నగరి పట్టణంలో మహా ర్యాలీ నిర్వహించి పీసీఎన్ హైస్కూల్ ఆవరణంలో విద్యార్థులతో కలిసి మొక్కలు నాటడం జరిగింది.
సందర్భంగా రోజా మాట్లాడుతూ.. రాజ్యసభ సభ్యులు సంతోష్ గొప్ప కార్యక్రమాన్ని చేపట్టారని అందులో నన్ను కూడా భాగస్వామి చేసినందుకు సంతోష్ కుమార్‌కి ధన్యవాదాలు తెలిపారు. వాతావరణ కాలుష్యాన్ని తగ్గించడానికి అందరం మొక్కలు పెంచాలని కోరారు. దాని వల్ల భారతదేశం మన తెలుగు రాష్ట్రాలు ఆకుపచ్చగా మారుతాయని అని అన్నారు. మొక్కలు నాటడమే కాకుండా వాటిని సంరక్షించే బాధ్యత కూడా అందరం తీసుకోవాలి పిలుపునిచ్చారు. ఈసందర్భంగా విద్యార్థులకు మొక్కలు పంచిపెట్టడం జరిగింది.
Planted a few saplings today as part of the #GreenChallenge by @mpsantoshtrs garu. Here's to a greener and cleaner Andhra Pradesh! pic.twitter.com/0jMyQMa7gR
— Roja Selvamani (@RojaSelvamaniRK) January 26, 2020
Thank you very much @RojaSelvamaniRK garu for bracing #GreenIndiaChallenge, Hope your participation will make this unique initiation as popular as you had become.
For each #Tree you plant, you are ensuring that generations to come will have a safer nd a better place to live in. https://t.co/Y2oAix1cTC
— Santosh Kumar J (@MPsantoshtrs) January 25, 2020