టీఆర్ఎస్‌లో చేరిన కాంగ్రెస్ కార్పొరేటర్..

85
trs

తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాల అనంతరం టీఆర్ఎస్ లోకి వలసల పర్వం ప్రారంభమైంది. రంగారెడ్డి జిల్లా బడంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ 31వ వార్డు కాంగ్రెస్ కార్పొరేటర్ చిరుగింత పారిజాత నరసింహారెడ్డి టీఆర్ఎస్ లో చేరారు.

ఈ సందర్భంగా విద్యాశాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి ఆమెకు పార్టీ కండువా కప్పి టీఆర్ఎస్ లోకి ఆహ్వానించారు. అనంతరం చిరుగింత పారిజాత నరసింహారెడ్డికి సబితా ఇంద్రారెడ్డి అభినందనలు తెలిపారు. ఆమెతో పాటు పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా టీఆర్ఎస్ లో చేరారు.