బీజేపీ నేతలు విచారణకేందుకు వస్తలేరు?

90
- Advertisement -

బీజేపీ నేతలు విచారణకేందుకు వస్తలేరని ప్రశ్నించారు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి. తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడిన రోహిత్…బీజేపీ కుట్రలను బయటపెట్టినందుకే తనకు ఈడీ నోటీసులు జారీ చేసిందన్నారు.

బీజేపీ జాతీయ నాయకులకు నోటీసులు వెళ్లడంతో తనను ఇబ్బందులకు గురి చేయాలని చూస్తున్నారని ఆరోపించారు. ఈడీ నోటీసులు, నందకుమార్‌ కస్టడీపై హైకోర్టులో రిట్‌ పిటిషన్‌ వేయనున్నట్లు తెలిపిన ఆయన.. బీఎల్‌ సంతోష్‌, తుషార్‌ సిట్‌ విచారణకు ఎందుకు రావడం లేదని ప్రశ్నించారు.

ఈడీ ద్వారా నోటీసు పంపి.. అందులో ఏ కేసు గురించి అడుగలేదని, వ్యక్తిగత సమాచారం, ఆస్తులకు సంబంధించి వివరాలు అడిగారని తెలిపారు. మొదటి రోజు ఆరు గంటలు విచారించారని, ఏ కేసు విషయంలో విచారిస్తున్నారో చెప్పలేదని, ఎలక్షన్ అఫిడవిట్ గురించి సమాచారం అడిగారని చెప్పారు. తనను భయబ్రాంతులకు గురిచేసి లొంగదీసుకోవాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఎనిమిది రాష్ట్రాల్లో దొంగ దారిలో ప్రభుత్వాలను పడగొట్టారని, తెలంగాణలో ప్రయత్నం బెడిసికొట్టే సరికి బీజేపీ ఓర్వలేకపోతుందన్నారు. ఎన్ని కేసులతో భయపట్టినా, బీజేపీకి భయపడేది లేదన్నారు.

ఇవి కూడా చదవండి..

 

- Advertisement -