మొక్కలు నాటిన ఎమ్మెల్యే రేగా కాంతారావు సతీమణి..

211
Green Challenge

రాజ్యసభ సభ్యులు టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన 3వ విడత గ్రీన్ ఛాలెంజ్‌లో భాగంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, పినపాక శాసనసభ్యులు రేగా కాంతారావు సతీమణి రేగా సుధారాణి కరకగూడెం మండలంలోని సమత్ భట్టుపల్లి గ్రామంలో మొక్కలు నాటడం జరిగింది. ఈ కార్యక్రమంలో కరకగూడెం ఎంపీపీ రేగా కాళీక వారి కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.