గ్రీన్ ఛాలెంజ్‌లో పాల్గొన్న జబర్దస్త్ సత్య…

206
jabardhast satya
- Advertisement -

రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా జబర్దస్త్ నటి సత్య మొక్కలు నాటారు. అనంతరం నటి సత్య మాట్లాడుతూ ఎంపీ సంతోష్ కుమార్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఆలోచనకు శ్రీకారం చుట్టడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. చెట్లు నాటడం ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు.

గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో నేను పాల్గొన్నందుకు ఆనందంగా ఉందని అన్నారు. జబర్దస్త్ పవన్ విసిరిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ను స్వీకరిస్తూ మోతినగర్‌లో మూడు మొక్కలు నాటడం జరిగింది. అనంతరం మరో ముగ్గురు (ఆర్టిస్ట్ ఉదయ శ్రీ , డాన్స్ మాస్టర్ అనీ , హీరో మనోజ్ నందన్ )లు కూడా గ్రీన్ ఛాలెంజ్ ను స్వీకరిస్తూ మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు.

- Advertisement -