ప్రతి ఒక్కరు గ్రీన్ ఛాలెంజ్‌లో పాల్గొనాలి..

124
MLA Rega Kantha Rao

రాజ్యసభ సభ్యులు ఎంపీ, టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు ప్రారంభించిన 3వ విడత గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, పినపాక శాసనసభ్యులురేగా కాంతారావు మూడు మొక్కలు నాటారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ గారి దృష్టితో చేపట్టిన హరితహారం భవిష్యత్ తరాలకు పచ్చని బంగారు బాట, ఇప్పుడు పచ్చదనం కోసం హరిత హారానికి మద్దతుగా చేపట్టినగ్రీన్ ఇండియా ఛాలెంజ్ ద్వారా మొక్కల పెంపకం వాటిని కాపాడే బాధ్యత పర్యావరణ పరిరక్షణకి తీసుకుంటున్న చొరవ అభినందనీయం. ఇలాంటి మంచి కార్యక్రమానికి మా వంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుంది. ఈ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఇలానే కొనసాగాలని కోరుకుంటున్నాను అదే విధంగా రాజ్యసభ సభ్యులు ఎంపీ, టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జోగినిపల్లి సంతోష్ కుమార్ గారికి నా తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నా అని రేగా కాంతారావు అన్నారు.