రాష్ట్రంలో భారీ వర్షాలు..

123
Heavy rains

ఆంధ్రప్రదేశ్ తీరానికి దగ్గరలో పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో 1.5 km నుండి 7.6 km ఎత్తు మధ్య ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఇది ఎత్తుకి వెళ్లే కొద్దీ దక్షిణ దిశ వైపుకు వంపు తిరిగి ఉన్నది. ఉత్తర ఇంటీరియర్ ఒరిస్సా మరియు దాని పరిసర ప్రాంతాలలో 1.5 km ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం ఏర్పడింది.

దీంతో తెలంగాణలో ఈరోజు, రేపు అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. అలాగే ఒకటి రెండు చోట్ల భారీవర్షాలు కురిసే అవకాశం ఉంది. ఎల్లుండి తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.