కూకట్ పల్లి నియోజకవర్గంలోని బాల నగర్,ఇందిరా నగర్‌లో మాధవరం కాంతారావు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత మెగా వైద్య శిబిరానికి ముఖ్య అతిథిగా హాజరైయ్యారు దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ట్విట్టర్‌లో కూస్తున్న కేటీఆర్ కు అధునాతన నగరం అని చెప్పుకునే హైదరాబాద్‌లో కూకట్‌పల్లికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్యే అభివృద్ధి కనిపించటం లేదా అని ప్రశ్నించారు.
ఐడీపీఎల్ అనే సంస్థను కట్టిన ఇందిరా నగర్ వాసుల కష్టాలు మంత్రి కేటీఆర్‌కు కనిపించట్లేదా, కోట్లు వెనకేసుకునే నాయకులకు కష్టం చేసే పేదల కనీసం అవసరాలు తీర్చలేని పరిస్థితిలో ఉన్నారా అని మండి పడ్డారు. ఫిబ్రవరిలో జరిగే శాసనసభ సమావేశాల్లో కూకట్ పల్లి నియోజకవర్గ ఇందిరా నగర్ కాలనీ సమస్యలపై గళం వినిపిస్తానని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో స్వచ్ఛ భారత్ అభియాన్ ఫౌండర్,ప్రేసిండెంట్ మాధవరం కాంతారావు,మేడ్చల్ అర్బన్ జిల్లా అధ్యక్షుడు హరీష్ రెడ్డి, డా” రామ్ సింగ్,డా శ్రీనివాస్ బృందం మరియు బిజెపి కార్యకర్తలు పాల్గొన్నారు.