‘మళ్ళీ మొదలైంది’ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్..

123
sumanth
- Advertisement -

సుమంత్ కథానాయకుడిగా నటించిన తాజా సినిమా ‘మళ్ళీ మొదలైంది’. టీజీ కీర్తి కుమార్ దర్శకత్వం వహించారు. ఈడీ ఎంటర్టైన్మెంట్ పతాకం మీద రాజశేఖర్ రెడ్డి నిర్మించారు. అనూప్ రూబెన్స్ సంగీతం అందించారు. ఈ సినిమాను ‘జీ 5’ ఓటీటీ రైట్స్‌ను దక్కించుకుంది. తాజాగా ఈ సినిమాను వచ్చే ఫిబ్రవరి 11న నేరుగా డిజిటల్ రిలీజ్ చేయబోతున్నారు. ఈ మేరకు విడుదల తేదీని ఖరారు చేసిన జీ గ్రూప్ వారు అఫీషియల్‌గా ప్రకటించారు.

విడాకులు తీసుకున్న ఓ యువకుడు, తన న్యాయవాదితో ప్రేమలో పడితే? అనే కథాంశంతో రూపొందిన సినిమా ‘మళ్ళీ మొదలైంది’. ఇందులో సుమంత్ భార్యగా వర్షిణీ సౌందర్ రాజన్, న్యాయవాది పాత్రలో ముఖ్య కథానాయికగా నైనా గంగూలీ నటించారు. ఆల్రెడీ విడుదలైన ఫస్ట్ లుక్ క్యారెక్టర్ పోస్టర్లు, టీజర్, ట్రైలర్ తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. సిద్ శ్రీరామ్ పాడిన ‘ఎలోన్ ఎలోన్’కు అద్భుత స్పందన లభించింది. ఈ సినిమాకు చరణ్ తేజ్ ఉప్పలపాటి సీఈవో. ‘జీ 5’ ఓటీటీలో ఈ నెల 21న ‘లూజర్’ సీజన్ 2 విడుదల కానున్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత ‘మళ్ళీ మొదలైంది’తో పాటు మరికొన్ని సినిమాలు విడుదల కానున్నాయి.

- Advertisement -