మొక్కలు నాటిన ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్..

318
prakash goud
- Advertisement -

రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ మొదలు పెట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా రాజేంద్ర నగర్ లో మొక్కలు నాటారు ఎం.ఎల్.ఏ ప్రకాష్ గౌడ్.సిడ్ గణేష్ లో భాగంగా రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ పిలుపు మేరకు ఎం.ఎల్.ఏ ప్రకాష్ గౌడ్ కు విత్తన గణపతిని అందజేసంది టీ న్యూస్ సిబ్బంది.

అడవులు అన్ని హరించి పోతున్న తరుణంలో సీఎం కేసీఆర్ గారు మాత్రం హరిత యజ్ఞం రూపంలో మళ్ళీ మొక్కలు నాటిస్తున్నారు.ఇందులో భాగంగా ఒక్కడితో మొదలు పెట్టి దేశ వ్యాప్తంగా విస్తరించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానని చెప్పారు.

సంతోష్ కుమార్ ఈ కార్యక్రమాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలని….అనంతరం నియోజకవర్గ ప్రజాలందరూ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ భాగంగా మొక్కలు నాటాలని ప్రకాష్ గౌడ్ పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో బోలె గౌడ్ , అమరేశ్ గౌడ్ , కిషోర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -