మొక్కలు నాటిన ఎమ్మెల్యే పట్నం…

31
mla patnam

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా కొడంగల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి తన పుట్టినరోజు సందర్భంగా హైదరాబాద్‌ ఫిలిమ్ నగర్ లోని తన నివాసం లో మొక్కను నాటారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే నరేందర్ రెడ్డి మాట్లాడుతూ వాతావరణ కాలుష్యాన్ని తగ్గించడానికి ప్రతి ఒక్కరూ బాధ్యతగా మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. నా జన్మదిన సందర్భంగా మొక్కను నాటడం నాకు చాలా ఆనందంగా ఉందని తెలిపారు.

ఇంత మంచి కార్యక్రమాన్ని చేపట్టి ముందుకు తీసుకుపోతున్న రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారికి ఎమ్మెల్యే గారు కృతజ్ఞతలు తెలియజేశారు.