రైతుల ముందు కేంద్రం కీలక ప్రతిపాదన..

31
delhi

రైతుల ముందు కేంద్రం కీలక ప్రతిపాదన ఉంచింది.రెండు సంవత్సరాలపాటు చట్టాలను నిలిపివేస్తామని ప్రతిపాదన ఉంచింది.కమిటి ఏర్పాటు చేసి వ్యవసాయ చట్టాల్లో అభ్యంతరాలపై అధ్యయనం చేసేలా చర్యలు తీసుకుంటామని ప్రతిపాదించింది.

రైతులు సానుకూల దృక్పథంతో ఆలోచించాలని కేంద్రం విజ్ఞప్తి చేసింది.కేంద్రంతో చర్చల సందర్భంగా రైతు మద్దతుదారులకు ఎన్ఐఏ ఇచ్చిన నోటీసులను ఉపసంహరించుకోవాలని రైతు సంఘాల నేతలు డిమాండ్ చేశారు.

ఎన్ఐఏ నోటీసుల అంశాన్ని తెలుసుకుంటానని తెలిపారు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్.వ్యవసాయ చట్టాలకు సవరణలు చేస్తామని ప్రతిపాదించగా మూడు చట్టాలను వెనక్కి తీసుకోవాల్సిందేనని స్పష్టం చేశారు రైతు సంఘాల ప్రతినిధులు.