ఆయిల్‌ఫామ్‌ సాగులో అగ్రస్ధానంలో తెలంగాణ..

162
niranjan reddy
- Advertisement -

ఆయిల్ ఫామ్ సాగులో తెలంగాణ అగ్రస్థానంలో నిలవాలన్నారు మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి.ఆయిల్ పామ్ సాగుపై రెడ్ హిల్స్ ఉద్యాన శిక్షణా కేంద్రంలో జరిగిన సమీక్షా సమావేశంలో సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి , వ్యవసాయ శాఖ కార్యదర్శి జనార్దన్ రెడ్డి, ఆయిల్ ఫెడ్ ఎండీ నిర్మల పాల్గొన్నారు.

కంపెనీలు వారికి కేటాయించిన ప్రాంతాలలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు నిరంజన్ రెడ్డి. ఫ్యాక్టరీ జోన్లలో గ్రామాల వారీగా సర్వే నిర్వహించి ఉద్యానశాఖకు నివేదిక అందించాలన్నారు. రాబోయే నాలుగేళ్లలో 8.14 లక్షల ఎకరాలలో ఆయిల్ పామ్ సాగు లక్ష్యం అన్నారు. ఇప్పటివరకు 15 జిల్లాలలో 8 కంపెనీలకు 4 లక్షల 61 వేల 300 ఎకరాలు కేటాయించామన్నారు.

ఉద్యానశాఖతో ఒప్పందం ప్రకారం కంపెనీలు సకాలంలో ఆయిల్ పామ్ పంటలను సాగులోకి తేవాలన్నారు. నీటి వసతి, ఆయిల్ పామ్ సాగుకి అనువైన నేలలు కలిగి ఉన్న రైతులను ఉద్యాన శాఖ సహకారం తో కంపెనీలు ఎంపిక చేసుకోవాలన్నారు. రైతులకు మేలైన ఆయిల్ పామ్ మొక్కలను సరఫరా చేసే బాధ్యత కంపెనీలదే .. వీలైనంత త్వరగా ఆసక్తిగల రైతులకు మొక్కలు అందించాలన్నారు.

ఈ విషయంలో ఆయిల్ ఫెడ్ కంపెనీలకు సహకారం అందించాలి…..ఐఐఓపీఆర్ మార్గదర్శకాలను అనుసరించి కంపెనీలు నర్సరీలు ఏర్పాటు చేయాలన్నారు. అధిక నూనె ఇచ్చే మేలైన రకాలను ఇతర దేశాల నుండి దిగుమతి చేయాలన్నారు. రైతులు మొక్క నాటడం నుండి పెంపకం, తోటల నిర్వహణ, గెలల కోత ఇలా ప్రతి దశలో సాగు, సాంకేతిక మెళకువలు సహకారం ఇచ్చేందుకు అయిల్ పామ్ సాగులో అనుభవం గల వ్యవసాయ పట్టభద్రులను కంపెనీలు తగినంత మందిని నియమించుకోవాలన్నారు.

- Advertisement -