ఎమ్మెల్యే నోముల భగత్‌ను అభినందించిన ఎమ్మెల్సీ కవిత..

60
MLA Nomula Bhagata

నాగర్జున సాగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఉపఎన్నికల్లో ఘన విజయం సాధించిన ఎమ్మెల్యే నోముల భగత్‌ను ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అభినందించారు. ఈ రోజు ఎమ్మెల్యే నోముల భగత్, ఎమ్మెల్సీ కవితను హైదరాబాద్ లోని నివాసంలో మర్యాద పూర్వకంగా కలిశారు.

కాగా, నోముల న‌ర్సింహ‌య్య అకాల మ‌ర‌ణంతో నాగార్జున‌సాగ‌ర్ నియోజ‌క‌వ‌ర్గానికి ఉపఎన్నిక అనివార్య‌మైన సంగ‌తి తెలిసిందే. ఏప్రిల్ 17న ఉపఎన్నిక పోలింగ్ జ‌రిగింది. ఓట్ల లెక్కింపును మే 2న‌ చేప‌ట్టి ఫ‌లితాల‌ను ప్ర‌క‌టించారు. సిట్టింగ్ స్థానాన్ని అధికార టీఆర్ఎస్ పార్టీ తిరిగి కైవ‌సం చేసుకుంది. పార్టీ అభ్య‌ర్థి నోముల భ‌గ‌త్ 18,804 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.