కరోనాపై ‘ఆర్ఆర్ఆర్’ టీం వినూత్న ప్రచారం.. వీడియో

46
rrr team

దేశంలో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ఆర్ఆర్ఆర్ చిత్ర బృందం ప్రజల్లో విస్తృతస్థాయిలో అవగాహన కల్పించేందుకు వినూత్న ప్రచారానికి తెరదీసింది. ఆర్ఆర్ఆర్ టీమ్ తాజాగా ఒక వీడియో రిలీజ్ చేశారు. పాన్ ఇండియన్ స్థాయిలో ప్రతీ ఒక్కరికీ ఈ సమాచారం అందేలా అర్థమయ్యేలా సౌత్ అండ్ నార్త్ ప్రధాన భాషల్లో ఈ విజ్ఞప్తి చేయడం విశేషం.

తెలుగులో ఆలియాభట్, తమిళంలో మెగా పవర్ స్టార్ రాం చరణ్, కన్నడలో యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్, మలయాళంలో దర్శకుడు రాజమౌళి హిందీలో బాలీవుడ్ నటుడు అజయ్ దేవగణ్ తాజా వీడియోలో మాట్లాడారు. కచ్చితంగా మాస్కు ధరించాలని, శానిటైజర్ తో తరచుగా చేతులను శుభ్రం చేసుకుంటుండాలని, భౌతికదూరం తప్పనిసరి అని ఆర్ఆర్ఆర్ యూనిట్ సభ్యులు పిలుపునిచ్చారు. కుటుంబ సభ్యులను, బంధుమిత్రులను టీకా వేసుకునేలా ప్రోత్సహించాలని సూచించారు.