నాగర్ కర్నూల్ జిల్లా తాడూర్ మండల కేంద్రంలో తాడూర్ మండల PACS కార్యాలయం ముందు రైతులు వరికోత మిషన్‌తో వరిచేను కోస్తున్న దృశాన్ని గమనించిన ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి వెంటనే అక్కడికి వెళ్లి రైతులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రైతులతో మాట్లాడుతూ వారు ఈ సీజన్‌లో పండించిన పంటల వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆ రైతు ఎన్ని ఎకరాలు వరి,మొక్కజొన్న పండించాడో అడిగి తెలుసుకున్నారు.వరి ధాన్యం ఎకరానికి ఎంత ధాన్యం దిగుబడి వస్తుంది అని వివరాలు తెలుసుకున్నారు.
ముఖ్యమంత్రి కెసిఆర్,తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ కరోన వైరస్ నేపథ్యంలో రైతుల కోసం చేపట్టిన చర్యలు ఎలా ఉన్నాయో అడిగి తెలుసుకున్నారు ఎమ్మెల్యే. ఇక సీఎం తీసుకున్న నిర్ణయాలు చాలా బాగున్నాయని.. రైతుల కోసం సీఎం చేస్తున్న కృషికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు అక్కడున్న రైతు సోదరులు. అనంతరం ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి వరికోత యంత్రాన్ని కొద్దిసేపు నడిపినారు.ఈ కార్యక్రమంలో డీసీసీబీ డైరెక్టర్ జక్కా రఘునందన్ రెడ్డి, PACS చైర్మన్ సమద్ పాషా, ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు,తదితరులు పాల్గొన్నారు.