బర్త్ డే…మొక్కలు నాటిన ఎమ్మెల్యే గోపినాథ్

46
gopinath

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారి పిలుపుమేరకు తన పుట్టినరోజు సందర్భంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా నేడు వెంగళరావునగర్ లోని కృష్ణకాంత్ పార్కు లో మొక్కలు నాటారు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మాట్లాడుతూ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం నాడు నా పుట్టినరోజు సందర్భంగా మొక్కలు నాటడం చాలా ఆనందంగా ఉందని. ఈ పుట్టిన రోజును నేను ఎప్పటికి మర్చిపోలేను అని తెలిపారు.

ప్రతి ఒక్కరూ బాధ్యతగా మొక్కలు నాటి వాటిని సంరక్షించాలి అని వాతావరణ కాలుష్యం తగ్గించడం కోసం అందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. తనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసి నన్ను మొక్కలు నాటాలని పిలుపునిచ్చిన రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు CN రెడ్డి, రాజ్ కుమార్ పటేల్ దేదీప్య ,టిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.