ప్ర‌గ‌తిప‌థంలో తెలంగాణ‌: ఇంద్రకరణ్ రెడ్డి

28
ikr

ప్రగతిపథంలో తెలంగాణ దూసుకుపోతోందన్నారు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి. నిర్మల్ కలెక్టరేట్‌లో నిర్వహించిన రాష్ట్ర అవతరణ వేడుకల్లో పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఇంద్రకరణ్…ఏడేండ్లుగా రాష్ట్రం ప్రగతిపథంలో దూసుకు పోతోందన్నారు.

నీళ్లు, నిధులు, నియామకాలు అనే నినాదంతో కోట్లాది మందిని ఏకం చేసి తెలంగాణ ఉద్య‌మ ర‌థసార‌ధి కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామ‌ని చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టు, సీతారామ, పాలమూరు-రంగారెడ్డి, డిండి ఎత్తిపోతలు తదితర ప్రాజెక్టులతో పాటు మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ వంటి పథకాలతో తెలంగాణ జ‌ల‌సిరితో కళకళ లాడుతోందని తెలిపారు.

ఇక రైతుబంధు దేశ చరిత్రలో కొత్త అధ్యాయాన్ని సృష్టించిందన్నారు. ఈ ప‌థ‌కానికి ఏటా రూ.15 వేల‌ కోట్లు వెచ్చిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ‌ అని గ‌ర్వంగా చెప్పారు.