- Advertisement -
సంగారెడ్డి జిల్లాలో కొత్తగా ఆందోల్- జోగిపేటను రెవెన్యూ డివిజన్‌గా ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆందోల్ రెవిన్యూ డివిజన్ ఏర్పాటు చేసినందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ కు కృతజ్ఞతలు తెలిపిన ఎమ్మెల్యే క్రాంతి కిరణ్, ఎంపీ బీబీ పాటిల్.
గత ఫిబ్రవరిలో రెవెన్యూ డివిజన్ కోసం ప్రాథమిక నోటిఫికేషన్ విడుదల చేయగా జూలై 13న తుది నోటి ఫికేషన్ ఇచ్చారు. దాంతో పాటు ఇదే డివిజన్‌లో కొత్తగా చౌటాకూర్ అనే కొత్త మండలాన్ని ఏర్పాటు చేశారు. అందోల్ డివిజన్ పరిధిలో ఆందోల్, పుల్కల్, వట్‌పల్లి, చౌటకూర్ మండలాలను చేర్చారు.
దీంతో రాష్ట్రంలో రెవెన్యూ డివిజన్ల సంఖ్య 73కి చేరింది. ఇక మండలాల సంఖ్య 590కి చేరింది.
- Advertisement -