తెలంగాణలో కరోనా మరణాల రేటు ఒక్కశాతమే!

54
corona

తెలంగాణలో ఇప్పటివరకు 36221 కరోనా కేసులు నమోదయ్యాయని తెలిపారు డైరెక్టర్ ఆఫ్ హెల్త్ శ్రీనివాస్ తెలిపారు.11525 టెస్టులు నిన్న ఒక్కరోజే పరీక్షలు చేశామని….దేశంలో 2.7 శాతం డెత్ రేట్ ఉంటే, తెలంగాణ లో ఒక్క శాతమేనని చెప్పారు.

తెలంగాణ లో 99 శాతం రికవరీ అవుతున్నారని…ఇప్పటివరకు కరోనాతో 365 మంది మృతిచెందారని తెలిపారు శ్రీనివాస్.హైదరాబాద్ లో ఎక్కువ కేసులు నమోదు అవుతున్నాయి..జీహెచ్ఎంసి లో 300 ఆస్పత్రుల్లో కరోనా టెస్టులు జరుగుతున్నాయని వెల్లడించారు.

తెలంగాణ లో 80 శాతం మందికి లక్షణాలు లేవు..9,786 మంది హోం ఐసోలేషన్ లో ఉన్నారని వెల్లడించారు.కరోనా ట్రీట్మెంట్ విషయంలో డి సెంట్రలైజ్ చేశారు..ప్రయివేటు మెడికల్ కాలేజీల్లో కూడా కరోనా ట్రీట్మెంట్ ఉచితంగా జరగనుందన్నారు.54 ప్రయివేట్ ఆస్పత్రుల్లో ట్రీట్మెంట్ జరుగుతుంది.. 98 ఆస్పత్రులకు అనుమతి ఉంది..వయసు పై బడిన వారు జాగ్రత్తగా ఉండాలి, వాళ్ళను కరోనా నుంచి కాపాడుకోవాలన్నారు.