టాస్‌ గెలిచిన కోల్‌కతా నైట్‌ రైడర్స్‌..

119
ipl

ఐపీఎల్‌-13లో నేడు మరో కీలక మ్యాచ్‌ జరగనుంది.. అబుదాబి వేదికగా ముంబై ఇండియన్స్‌, కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ జట్లు పోటీపడుతున్నాయి. కొత్త కెప్టెన్‌ ఇయాన్‌ మోర్గాన్‌ సారథ్యంలో కోల్‌కతా బరిలో దిగుతోంది. టాస్‌ గెలిచిన మోర్గాన్‌ బ్యాటింగ్‌ ఎంచుకున్నాడు. టామ్‌ బాంటన్‌, నాగర్‌కోటి స్థానంలో శివమ్‌ మావి, క్రిస్‌ గ్రీన్‌లను తుది జట్టులోకి తీసుకున్నట్లు మోర్గాన్‌ చెప్పాడు.

సీజన్‌ ఆరంభం నుంచి ముంబై పేస్‌ విభాగాన్ని ముందుండి నడిపిస్తున్న జేమ్స్‌ పాటిన్సన్‌కు విశ్రాంతినిచ్చినట్లు ముంబై సారథి రోహిత్‌ శర్మ తెలిపాడు. అతని స్థానంలో నాథన్‌ కౌల్టర్‌ నైల్‌ను తీసుకున్నట్లు వెల్లడించాడు.

జట్ల వివరాలు:
ముంబై ఇండియన్స్‌: రోహిత్ శర్మ (కెప్టెన్), క్వింటన్ డికాక్ (వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా, కీరన్ పొలార్డ్, కృనాల్ పాండ్యా, నాథన్ కౌంటర్‌నైల్, రాహుల్ చాహర్, ట్రెంట్ బౌల్ట్, జాస్ప్రిత్ బుమ్రా.

కోల్‌కతా నైట్‌ రైడర్స్‌: రాహుల్ త్రిపాఠి, శుభమాన్ గిల్, నితీష్ రానా, ఇయాన్ మోర్గాన్ (కెప్టెన్), దినేష్ కార్తీక్ (వికెట్ కీపర్), ఆండ్రూ రస్సెల్, క్రిస్ గ్రీన్, పాట్ కమిన్స్, శివం మావి, వరుణ్ చక్రవర్తి, ప్రసిద్ధ్ క్రిష్ణ