మొక్కలు నాటిన చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య..

38
MLA Kale Yadaiah

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ పిలుపుమేరకు ఈరోజు తన జన్మదినం సందర్భంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా మొయినాబాద్ లోని ప్రగతి రిసార్ట్‌లో మొక్కలు నాటారు చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పకృతిని మనం సంరక్షిసిస్తే అది మనల్ని కాపాడుతుంది అని మా చేవెళ్ల నియోజకవర్గంలోని ప్రగతి రిసార్ట్‌లో ఎన్నోరకాల ఔషధ మొక్కలను పెంచడం జరుగుతుందని తెలిపారు.

ఈ రోజు నా పుట్టినరోజు సందర్భంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా ప్రగతి రిసార్ట్ లోనే మొక్కలు నాటడం జరిగింది అని తెలిపారు. నాకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసి మొక్కలు నాటాలని పిలుపునిచ్చిన రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ గారికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రగతి రిసార్ట్ చైర్మన్ GBK రావు, MD అజయ్, డైరెక్టర్ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.