ఓటీటీకి నో.. విడుదలపై ‘ఖిలాడీ’ క్లారిటీ..

77
Ravi Teja

టాలీవుడ్‌ హీరో మాస్ మహారాజా రవితేజ ప్రధాన పాత్రలో వస్తున్న తాజా చిత్రం ఖిలాడి. ఈ చిత్రాన్ని దర్శకుడు రమేష్ వర్మ తెరకెక్కిస్తున్నారు. ముందుగా అనుకున్న షెడ్యూల్ ప్రకారం ఈ సినిమా ఈ నెలలో విడుదల కావలసి ఉంది. అయితే కరోనా వలన ఈ సినిమా వాయిదా పడింది. ఈ నేపథ్యంలో ఈ సినిమాకు ఓటీటీ డీల్ కుదిరినట్టు.. అమెజాన్ ప్రైమ్ ఈ చిత్రాన్ని ఆరు కోట్లకు పైగా ధర చెల్లించి డిజిటల్ రైట్స్ దక్కించుకుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ క్ర‌మంలో మేకర్స్ పోస్ట‌ర్ ద్వారా పూర్తి క్లారిటీ ఇచ్చారు. ఖిలాడి చిత్రాన్ని థియేట‌ర్స్‌లోనే విడుద‌ల చేయ‌నున్న‌ట్టు పేర్కొన్నారు.

ఈ చిత్రంలో రవితేజ డ్యూయల్ రోల్స్ లో నటిస్తుండగా డింపుల్ హయాతి, సాక్షి చౌదరి హీరోయిన్స్ గా నటిస్తున్నారు. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రంలో ఓ ప్రత్యేక గీతం ఉంటుందని.. అందులో అందాల తార ప్రణీత నర్తిస్తుందని సమాచారం. యాక్షన్ కింగ్ అర్జున్ ఈ సినిమాలో ప్రతినాయకుడిగా నటిస్తుండటం విశేషం. ప్రముఖ నిర్మాణ సంస్థ పెన్ మూవీస్ నిర్మిస్తోంది. యాంకర్ అనసూయ ప్ర‌త్యేక‌ పాత్రలో కనిపించనుంది.