పసుపుబోర్డుకు ఏడాది:ఎంపీకి గుర్తుచేసిన టీఆర్ఎస్ ఎమ్మెల్యే

768
jeevan reddy
- Advertisement -

నిజామాబాద్‌లో పసుపుబోర్డు అంశాన్ని ప్రధాన ఎజెండాగా చూపిస్తూ ఎంపీ ధర్మపురి అరవింద్ విజయం సాధించిన సంగతి తెలిసిందే. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన 5 రోజుల్లోనే పసుపుబోర్డు తీసుకోస్తానని లేకుంటే తన పదవికి రాజీనామా చేస్తానని బాండ్ పేపర్ కూడా రాసిచ్చారు అరవింద్.

ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత పసుపుబోర్డు అంశం తెరమీదకు వచ్చిన ప్రతిసారి తప్పించుకుంటు వస్తున్నారు అరవింద్. ఫలితంగా ఆయన ఎంపీగా గెలిచి ఏడాది పూర్తయింది కానీ నిజామాబాద్‌కు పసుపుబోర్డు రాలేదు.

ఈ నేపథ్యంలోనే ట్విట్టర్‌ ద్వారా ఎంపీ అరవింద్‌కు పసుపుబోర్డు అంశాన్ని గుర్తుచేశారు ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి.ఎంపీ గా సంవత్సరం పూర్తి చేసుకునందుకు మీకు శుభాకాంక్షలు అంటూనే మీరు రాసి ఇచ్చిన బాండ్ పేపర్ గురించి మీకు గుర్తుందని నేను భావిస్తున్నాను అని పేర్కొన్నారు.

bond

- Advertisement -