కేసీఆర్‌ను కలిసిన ఎమ్మెల్యే గూడెం

15
- Advertisement -

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో అసెంబ్లీలో కేసీఆర్‌ను కలిశారు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి. తన తమ్ముడి కుమారుడి పెళ్లికి రావాలని ఆహ్వాన పత్రికను అందజేశారు.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల తర్వాత పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి బీఆర్‌ఎస్‌ నుంచి కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. కానీ ఆ తర్వాత జరిగిన పరిణామాలతో కొంతకాలానికే ఆయన యూటర్న్‌ తీసుకున్నారు. కాంగ్రెస్‌లో అనధికారికంగా కొనసాగుతున్నప్పటికీ.. పలు సందర్భాల్లో బీఆర్‌ఎస్‌కు, కేసీఆర్‌కు అనుకూలంగా వ్యవహరిస్తున్నారు.

పార్టీ ఫిరాయింపు నేతల విషయంలో నిర్ణయం తీసుకోవడానికి ఎంత సమయం కావాలో చెప్పాలంటూ స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌కు సుప్రీంకోర్టు ఇటీవల నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే.

Also Read:మాది రైతు ప్రభుత్వం: గవర్నర్ జిష్ణుదేవ్

- Advertisement -