గ్రామీణాభివృద్ధే టీఆర్ఎస్ ప్రభుత్వ ధ్యేయం..

16

యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం మండల కేంద్రంతో పాటు చీకటిమామిడి గ్రామాల్లో హెచ్ఎమ్‌డిఏ నిధులతో ఏర్పాటు చేసిన విద్యుత్ దీపాలను ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ గొంగిడి సునీత ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సునీత మాట్లాడుతు.. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి ధ్యేయంగా టిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం పని చేస్తుందని అన్నారు. ఎల్ఈడీ లైట్లుతో తక్కువ కరెంటు చార్జీలు వచ్చే అవకాశం ఉంటుందని అన్నారు..ఓమిక్రాన్ వైరస్ వేగంగా విస్తరించడంతో ప్రజలు పలు జాగ్రత్తలు పాటించాలని ఎమ్మెల్యే విజ్ఞప్తి చేశారు.