శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖ సింగర్‌ ఎస్‌పీ శైలజ..

22

ఆదివారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు ప్రముఖ సింగర్‌ ఎస్‌పీ శైలజ. ఇవాళ ఉదయం వి.ఐ.పి విరామ సమయంలో సినీ గాయనీ ఎస్పి శైలజ స్వామి వారి సేవలో పాల్గోని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఆమెకు రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం అందించగా.. ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామి వారి తీర్ధ ప్రసాదాలు అందజేశారు.