గ్రీన్ ఛాలెంజ్‌తో హరిత తెలంగాణకు బాటలు…

105
dadannagari vittal

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ హరిత ఉద్యమంలా కొనసాగుతుంది. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా జెడ్పి చైర్మన్ దాదన్నగారి విట్టల్‌ జన్మదినాన్ని మరియు గాంధీ జయంతిని పురస్కరించుకొని మొక్కలు నాటారు జెడ్పి చైర్మన్ దాదన్న గారి విట్టల్ రావు.

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ హరిత తెలంగాణ కు బాటలు వేస్తుందని జెడ్పి చైర్మన్ దాదన్న గారి విట్టల్ రావు పేర్కొన్నారు. రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఒక హరిత ఉద్యమంల దేశవ్యాప్తంగా విస్తరించడం శుభ పరిణామం అన్నారు. నిజామాబాద్ నగరంలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా చైర్మన్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని నుడా చైర్మన్ ప్రభాకర్, తెరాస రాష్ట్ర నాయకులు రాంకిషన్ రావు, కేసీర్ సేవాదళ్ జిల్లా అధ్యక్షులు రమణారావు, తెరాస రాష్ట్ర యూత్ నాయకులు దాదన్న గారి సందీప్ రావు, గార్లతో కలిసి చైర్మన్ గారు మొక్కలు నాటారు.

ఈ సందర్భంగా చైర్మన్ గారు మాట్లాడుతూ భవిష్యత్తు తరాలకు ఆస్థి పాస్తులు ఇవ్వకున్న , స్వచ్ఛమైన గాలి అందించాలని అన్నారు. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రతి ఏటా తెలంగాణ వ్యాప్తంగా హరితహారం కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపడుతున్నారని అన్నారు. దాని ప్రతి ఫలమే నేడు రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నాయని అన్నారు. జంగల్ బచావో -జంగల్ బడావో కార్యక్రమంలో భాగంగా 24 శాతం ఉన్న అడవులను 33 శాతానికి పెంచే లక్ష్యంతో కార్యక్రమం కొనసాగుతుందన్నారు.

తెలంగాణ కు ఆకుపచ్చని మణిహారంగా హరితహారం నిలిచిపోతుందని, జెడ్పి చైర్మన్ పేర్కొన్నారు. మరో వైపు ఒక మంచి ఆలోచనతో రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ గారు ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కు మంచి స్పందన వచ్చిందని, దేశ వ్యాప్తంగా ఛాలెంజ్ ను స్వీకరించి అనేక మంది మొక్కలు నాటుతున్నారని , ఎంపీ గారిని చైర్మన్ గారు ప్రశంసించారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా ఇప్పటికే 3 కోట్లకు పైగా మొక్కలు నాటడం ఎంతో గొప్ప విషయం అన్నారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ దండు నీతూ కిరణ్ శేఖర్, నాయకులు కోటపాటి నర్సింహా నాయుడు, గోపాల్ నగేష్, శేఖర్ రెడ్డి, మాణికేశ్వర్ రావు, మనోహర్ రావు, అంజయ్య, కుటుంబ సభ్యులు అశోక్ రావు, అమర్ రావు, పి. పి. మధుసుధన్ రావు, రమణారావు, మంజిత్ రావు పద్మ నాయక వెలమ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు.