యుద్దవీరుల అనన్య త్యాగనిరతి దేశానికే స్ఫూర్తిదాయకం..

98
- Advertisement -

నీలగిరి కొండల్లో నేలకొరిగిన త్రిదళాలాధిపతి, జనరల్ బిపిన్ రావత్, మరో 13 మంది సైనికులకు తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి నివాళ్ళర్పించారు. స్థానిక ఎస్వీ యూ క్రీడా మైదానంలో ఎన్‌సిసి వారి ఆధ్వర్యంలో జరిగిన సైనికుల సంస్మరణ కార్యక్రమాల్లో ఎమ్మెల్యే భూమన పాల్గొని, వారి చిత్రపటాలకు పుష్పాంజలి ఘటించారు. అనంతరం మీడియాతో భూమన మాట్లాడుతూ.. దేశ రక్షణ కోసం ప్రాణ త్యాగాలు చేసిన భారత త్రిదళాధిపతి, జనరల్ బీపీ రావత్‌తో పాటు 13 మంది సైనికులను దేశం కోల్పోవడం పట్ల యావత్ భారత్ దేశం కన్నీరు కారుస్తోందన్నారు. దేశ రక్షణ కోసం తమ ప్రాణాలనే త్యాగం చేసిన యుద్ద వీరుల అనన్య త్యాగనిరతి దేశానికే స్ఫూర్తి దాయకం అన్నారు.

ఆ మహానీయలకు యావత్ దేశ ప్రజలతో పాటు పోలీసు అధికారులు, ఎన్‌సీసీ అధికారులు, మున్సిపల్ అధికారులు పెద్ద ఎత్తున అంజలి ఘటిస్తున్నారని తెలిపారు. దేశం శోకతప్త హృదయంతో నిండిపోయి,సైనికుల సేవల్ని కొనియాడుతున్న తరుణంలో,శత్రు మూకలైన చైనా దేశం నుంచి దుష్ప్రచారం జరగడాన్ని ఖండిస్తున్నట్టు చెప్పారు. చైనా కవ్వింపు చర్యలకు తగిన సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో అర్బన్ ఎస్పీ వెంకటప్ప నాయుడు, తిరుపతి ఎన్సిసి గ్రూప్ కమాండ్ యోగేష్, పలువురు ఐపీఎస్ ఐఏఎస్ అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -