గ్రేటర్‌లో కేటీఆర్ ముమ్మర ప్రచారం

21
ktr

గ్రేటర్ హైదరాబాద్ ప్రగతి నివేదికను విడుదల చేశారు మంత్రి కేటీఆర్. గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌పై మరోసారి గులాబీ జెండా ఎగుర వేసే లక్ష్యంతో నివేదికను రూపొందించగా నేటి నుండి ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నారు కేటీఆర్.

నేటి నుంచి ఈ నెల 30వ తేదీ వరకు జీహెచ్‌ఎంసీ పరిధిలోని 20 నియోజకవర్గాల్లో రోడ్‌షోలు నిర్వహించనున్నారు. కూకట్ పల్లి‌ నియోజకవర్గంలో రోడ్‌షో ప్రారంభించి.. కుత్బుల్లాపూర్ లో ప్రచారం చేయనున్నారు. సాయంత్రం 5 గంటలకు ఓల్డ్‌ అల్లాపూర్‌ చౌరస్తా,చిత్తారమ్మ తల్లి చౌరస్తా, రాత్రి 7గంటలకు ఐడీపీఎల్‌ చౌరస్తా, 8గంటలకు సాగర్‌ హోటల్‌లో జంక్షన్‌లో కేటీఆర్‌ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం నిర్వహించనున్నారు.రోజుకు నాలుగు నుంచి ఆరు చోట్ల మంత్రి కేటీఆర్‌ రోడ్‌ షో ఉండేలా ఏర్పాట్లు చేసింది. అలాగే పలు డివిజన్లలో రాష్ట్ర మంత్రులు అభ్యర్థుల పక్షాన ప్రచారం నిర్వహించనున్నారు.