ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్రం గుడ్‌ న్యూస్‌..

174
Work from home
- Advertisement -

కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో కేంద్రం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఉద్యోగుల్లోని కొన్ని వర్గాలకు కేంద్రం వర్క్ ఫ్రం హోం అవకాశం కల్పించింది. దివ్యాంగులైన ఉద్యోగులు, గర్భవతులైన ఉద్యోగులు, కంటైన్మెంట్ జోన్‌లో నివసించే అధికారులు, ఉద్యోగులు ఇంటి వద్ద నుంచే పనిచేసుకోవచ్చని ఓ ప్రకటనలో వెల్లడించింది. మే 31 వరకు ఈ వెసులుబాటు అమల్లో ఉంటుందని కేంద్ర సిబ్బంది, శిక్షణ వ్యవహారాల శాఖ తెలిపింది.

అంతకుముందు, ప్రభుత్వ ఉద్యోగుల్లో 50 శాతం మందికి వర్క్ ఫ్రం హోం అవకాశం కల్పించిన కేంద్రం… తాజా ప్రకటన ద్వారా ఆ సదుపాయాన్ని మరింతమందికి అందించింది. ఈ ఉత్తర్వులు వివిధ కేంద్ర ప్రభుత్వ శాఖల ఉద్యోగులు, గ్రూప్-బి, గ్రూప్-సి ఉద్యోగులకు వర్తిస్తాయి. గ్రూప్-ఏ ఉద్యోగులకు పనిగంటలు తగ్గించారు. ఆఫీసులకు హాజరయ్యే ఉద్యోగులు కరోనా మార్గదర్శకాలను కచ్చితంగా పాటించాలని కేంద్రం స్పష్టం చేసింది.

- Advertisement -