రైతుల కుటుంబాలకు చేయూత- మంత్రి అల్లోల

38
minister ik reddy

మామడ మండలం కొరిటికల్ గ్రామానికి చెందిన రైతు అలిగుల నర్సయ్య ప్రమాదవశాత్తు మరణించగా ఈ విషయాన్ని మండల నాయకులు మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. తక్షణమే స్పందించిన మంత్రి రైతు మరణించిన 24 గంటల వ్యవధిలోనే రైతు భరోసా కింద రూ.5 లక్షలను మంజూరు చేయించి శనివారం రైతు భార్య అలిగుల లక్ష్మీ కి చెక్కును అందజేసారు. అలాగే మరో రైతు మేకల దాసు ఇటీవల ప్రమాదవశాత్తు మరణించగా.. రైతు భీమా ద్వారా మంజూరైన రూ. 5లక్షల చెక్కును అతని భార్య మేకల మరియకు మంత్రి అందజేశారు.

ఈ సందర్భంగా మంత్రి అల్లోల మాట్లాడుతూ… దేశానికి అన్నం పెట్టే రైతన్న కుటుంబానికి న్యాయం చేయాలన్న ఉద్దేశ్యంతో దేశంలో ఎక్కడలేని విధంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ రైతు బీమా పథకాన్ని ప్రవేశ పెట్టి రైతుల కుటుంబాలకు చేయూతనిస్తున్నారన్నారని తెలిపారు.