బీజేపీ భరతం పట్టడానికి యువత సిద్ధం కావాలి- ఎమ్మెల్యే బాల్క

88
- Advertisement -

ఏనాడు తెలంగాణ ఉద్యమంలో లేని వ్యక్తులు ఉద్యోగాల పేరుమీద డ్రామాలు చేస్తున్నారు. బండి సంజయ్ ఉద్యమంలో ఎక్కడ ఉన్నాడు? అని ప్రశ్నించారు ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే బాల్క సుమన్. సోమవారం ఆయన టీఆర్‌ఎస్‌ భవన్‌లో మీడియా సమావేశంలో మాట్లాడారు. బీజేపీ ఏడాదికి 2కోట్ల ఉద్యోగాలు ఇస్తానని ఇప్పటికి ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు?.. తెలంగాణకు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు? అని ప్రశ్నించారు. కేటీఆర్ తరహాలో కేంద్రం ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిందో బహిరంగ లేఖ విడుదల చేసే దమ్ము బండి సంజయ్ కి ఉందా?.. కొత్త సంవత్సరంలో వేలాది ఉద్యోగాలు ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది. గుజరాత్‌లో ప్రభుత్వం ఎన్నివేల ఉద్యోగాలు ఇచ్చారో ప్రకటన చేయాలి. మధ్యప్రదేశ్‌లో యువతపై లాఠీ ఛార్జ్ చేసిన ఘనత మీది కాదా? అని విమర్శించారు.

మోడీ ప్రభుత్వం పాలనలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో కేటీఆర్ తరహాలో లేఖ సంజయ్ విడుదల చేయాలి. బండి సంజయ్‌కి చీము నెత్తురు ఉంటే లేఖ విడుదల చేయాలి. బీజేపీ ప్రభుత్వం టీఆరెస్ తరహాలో ఎందుకు లేఖలు విడుదల చేయరు? అని మండిపడ్డారు. సింగరేణి రంగం ప్రైవేటీకరణ చేస్తూ యువతకు అన్యాయం చేస్తోంది. బీజేపీ భరతం పట్టడానికి యువత సిద్ధం కావాలి. బీజేపీ పట్ల యువత మౌనం పాటించవద్దు. ఏ వేదిక దొరికితే ఆ వేదికలో బీజేపీని నిలదియ్యాలి. దొంగలే దొంగా దొంగా అన్నట్లు బీజేపీ నాయకులు ప్రవర్తిస్తున్నారని ఎమ్మెల్యే బాల్క ఎద్దేవ చేశారు.

ఇందూరు రైతులను స్ఫూర్తిగా తీసుకోని రాష్ట్ర యువత- ప్రజలు బీజేపీ నేతలను నిలదియ్యాలి. తెలంగాణ బీజేపీ నేతలు గుజరాత్‌కు గులాం గా మారారు.. రైతుల అంశం ప్రశ్నిస్తామనే ఉద్యోగాల పేరుతో కొత్త డ్రామా ఆడుతున్నారు. కేంద్రం తెలంగాణకు అన్ని రంగాల్లో అన్యాయం చేస్తోంది. యువత బీజేపీ చేసే విషపు ప్రచారం ట్రాప్‌లో పడొద్దు అని ఎమ్మెల్యే బాల్క సుమన్‌ సూచించారు.

- Advertisement -