‘పుష్ప’ను వీక్షించిన చిరు.. సుకుమార్‌పై ప్రశంసలు..

24
Megastar Chiranjeevi

ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్, రష్మిక మందన్న జంటగా తెరకెక్కిన చిత్రం ‘పుష్ప ది రైజ్’. సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా డిసెంబరు 17న గ్రాండ్‌ రిలీజ్‌ అయింది. తొలి రోజు నుండి పుప్ప రాజ్ భారీ వసూళ్లతో దూసుకుపోతున్నాడు. అయితే తాజాగా ఈ చిత్రాన్ని మెగాస్టార్ చిరంజీవి వీక్షించారు. అనంతరం ఆయన పుప్ప చిత్ర బృందాన్ని అభినందించారు.

‘పుష్ప’ చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఈ మేరకు ట్విట్టర్ లో వెల్లడించింది. ‘పుష్ప ది రైజ్’ చిత్రంలోని ప్రతి ఘట్టాన్ని చిరంజీవి ఎంతో ఆస్వాదించారని తెలిపింది. దర్శకుడు సుకుమార్‌ను చిరంజీవి అభినందించారని, బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించారంటూ కొనియాడారని మైత్రీ మూవీ మేకర్స్ పేర్కొంది.