3 సంవత్సరాల నుండి మొక్కలు నాటుతున్న చిన్నారులు..

30

ఉప్పల్‌కు చెందిన ట్విన్స్ లయ-ప్రియ లు సోమవారం తమ పుట్టినరోజు పురస్కరించుకొని రాజ్యసభ సభ్యులు ఎంపీ సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొని మొక్కలు నాటారు. ఉప్పల్ మల్లాపూర్ వెంకటరమణ కాలనీలో ప్రిన్స్ లయ-ప్రియ తమ పుట్టిన రోజు సందర్భంగా గత మూడు సంవత్సరాల నుండి ప్రతి పుట్టిన రోజున మూడు మొక్కలు నటుతున్నారు.

ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ.. ప్రకృతి తల్లికి అలాగే ఎంపీ సంతోష్ కుమార్ అంకుల్ గారికి వందనాలు తెలిపారు. గత మూడు సంవత్సరాలుగా ప్రతి పుట్టిన రోజున మొక్కలు నటుతున్నము అని తెలిపారు. ఇలానే ప్రతి ఒక్కరూ తమ పుట్టిన రోజున మొక్కలు నటి నెల తల్లిని కాపాడండి అని, లయా ప్రియ కోరారు.