బండి, గుండును రైతులు బట్టలూడ దీసి కొడతారు..

120
- Advertisement -

బీజేపీ నేతలు బండి సంజయ్, అరవింద్ సభ్యత సంస్కారాలు లేకుండా మాట్లాడుతున్నారని తెలంగాణ ప్రభుత్వ విప్ బాల్క సుమన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం టీఆర్ఎస్ ఎల్పీ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో పాల్గొన్నారు. బాల్క సుమన్‌తో పాటు ఎమ్మెల్యేలు సైది రెడ్డి, సురేందర్‌లు ఈ ప్రెస్‌ మీట్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ బాల్క సుమన్ మాట్లాడుతూ.. అరవింద్ ఎంపీ నని మరచిపోయి బజారు భాష వాడుతున్నారు..ముఖ్యమంత్రి కేసీఆర్ అన్ని విషయాలు కుండబద్దలు కొట్టినట్టు మాట్లాడారు..బండి, ధర్మపురి శృతిమించి మాట్లాడితే తెలంగాణ రైతులు బట్టలూడ దీసి కొడతారు జాగ్రత్త అని హెచ్చరించారు.

తెలంగాణ రైతుల మీద కేంద్రం, బీజేపీ కక్ష కట్టినట్టు కనిపిస్తోంది.. బీజేపీ నాయకులు అసలు విషయాల మీద మాట్లాడకుండా కేసీఆర్‌ను ఏక వచనంతో మాట్లాడుతున్నారు..అరవింద్ కండ కావరంతో మాట్లాడుతున్నారు.. తగిన శాస్తి తప్పదు అన్నారు. పసుపు బోర్డు తేనోడు ప్రపంచ విషయాలు మాట్లాడుతున్నాడు..ఎస్సీ, ఎస్టీ అత్యాచార చట్టాన్ని లొట్టపీసు చట్టమన్న అరవింద్‌ను దళిత గిరిజన ఆదివాసీలు బట్టలూడ దీసి కొట్టడం ఖాయం మండిపడ్డారు..ఇక అర్థం పర్థం లేకుండా మాట్లాడుతున్న బీజేపీకి రోజులు దగ్గర పడ్డాయి. మా రైతుల ఆగ్రహానికి గురికాక తప్పదు..కేసీఆర్ భాష గురించి మాట్లాడుతున్న బండి సంజయ్ ఒక సారి వెనక్కి తిరిగి చూసుకో..థర్డ్ క్లాస్ నేతలుగా బీజేపీ ఎంపీలు మారిపోయారు..రైతులే బీజేపీ నేతల నాలుకలు చీరేస్తారు జాగ్రత్త అని బాల్క విమర్శించారు.

ఏడేళ్ళ కింద తెలంగాణలో వ్యవసాయం ఎట్లుండే. ఇపుడు ఎట్లా ఉంది బీజేపీ నేతలకు తెలియదా..కేసీఆర్ చిత్తశుద్ధిని శంకిస్తారా?..కేసీఆర్ ఉద్యమం చేసినపుడు అరవింద్, బండి ఎక్కడున్నారు..కేసీఆర్ ఒక్క ఇషారా చేస్తే వారి భరతం పడతాం..కేసీఆర్ ఓపికతో వారు బతికి పోతున్నారు..కేసీఆర్ గురించి మాట్లాడే స్థాయా వారిది ఆగ్రహం వ్యక్తం చేశారు.. పచ్చగా ఉన్న తెలంగాణలో చిచ్చు పెట్టాలనే ప్రయత్నం బీజేపీది..బీజేపీ ఆటలు సాగనివ్వం అన్నారు..గుజరాత్‌ను తెలంగాణ దాటి పోతుందన్న అక్కసు తోనే బీజేపీ మన రైతులపై కక్ష కట్టింది..కేసీఆర్‌ను ఒకటంటె బీజేపీ ని పది అంటాం..కేంద్రం వ్యవసాయం మీద వార్షిక ప్రణాళిక ప్రకటించేలా బీజేపీ ఎంపీలు పార్లమెంట్లో ఒత్తిడి తేవాలి.. మోడీ ఆఫీస్ ముందు ధర్నా చేయాలని డిమాండ్ చేశారు.

బీజేపీలో విద్యాసాగర్ రావు దత్తాత్రేయ అంటే గౌరవం ఉండేది..ఇపుడు బీజేపీ కంపు నేతలతో నిండి పోయింది..తెలంగాణకు పట్టిన శని బీజేపీ దుయ్యబట్టారు..బెంగాల్ తరహా రాజకీయాలు తెలంగాణలో నడవవు..మేధావులు బీజేపీ నేతల భాషను గమనించాలి…బీజేపీ నేతలు తమ తీరు మార్చుకోకపోతే తీవ్ర పరిణామాలు తప్పవు..తెలంగాణకు మేలు చేయని బీజేపీ ఎంపీలు దద్దమ్మలు కాక మరేమీ అవుతారు అని బాల్క సుమన్‌ ఎద్దేవ చేశారు.

ఎమ్మెల్యే సైది రెడ్డి మాట్లాడుతూ.. బీజేపీ గుజరాత్ కంపెనీలా మారిపోయింది..ఒకప్పుడు ఈస్ట్ ఇండియా కంపెనీ దేశాన్ని పీడించినట్టే బీజేపీ దేశాన్ని పీడిస్తోంది..వ్యవసాయానికి తెలంగాణ ఉదాహరణ..కేసీఆర్ రైతుకు చేసిన మేలు దేశంలో మరెవరైనా చేశారా అని ప్రశ్నించారు..గుజరాత్ బడా వ్యాపార వేత్తల గురించే బీజేపీ యావ తప్ప రైతుల పట్ల ప్రేమ లేదు…హుజూరా బాద్ ఫలితంతో వడ్లకు ఏం సంబంధం..హుజురాబాద్‌లో బీజేపీ గెలిచింది అని మేము అంతటా చెబుతాం.. మా వడ్లు కొంటామని ఒక ప్రకటన తీసుకు రండి అని అన్నారు…ఆదానీ, అంబానీ లను బాగు చేయడం తప్ప బీజేపీకి మరో పని లేదు.బీజేపీకి తెలంగాణ ప్రజలు కర్రు గాల్చి వాత పెడతారని విమర్శించారు.

ఎమ్మెల్యే సురేందర్ మాట్లాడుతూ.. కేసీఆర్‌ను తిడితే బీజేపీ ఎంపీలు హీరోలు కారు. జీరోలు అవుతారు.కిషన్ రెడ్డి అంటే ఒక గౌరవం ఉండేది అది పోయింది..బీజేపీ నేతల భాష తెలంగాణ సమాజం తలదించుకునేలా ఉంది అన్నారు. ఢిల్లీ బీజేపీ నేతలు ఒకటి మాట్లాడితే ఇక్కడి బీజేపీ నేతలు మరొకటి మాట్లాడుతున్నారు..కేసీఆర్ మాట అంటే తెలంగాణ ప్రజలకు శాసనం లాంటిది…కేసీఆర్ చెప్పినట్టే రైతులు నడుచుకుంటారు తప్ప బీజేపీ నేతల మాటలు వినరు..బీజేపీ మాటలు వింటే రైతులకు నష్టం తప్పదు అని పేర్కొన్నారు.

- Advertisement -