తెలంగాణలో కరోనా బారినపడ్డ మరో ఎమ్మెల్యే..

233
- Advertisement -

తెలంగాణలో కరోనా వైరస్‌ ప్రజాప్రతినిధులను కూడా వదలడంలేదు. తాజాగా, నిజామాబాద్ రూరల్ టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ కరోనా పాజిటివ్‌ అని తేలింది. వైద్య పరీక్షల్లో ఆయనకు కరోనా పాజిటివ్ అని తేలింది. దాంతో ఆయన చికిత్స కోసం హైదరాబాద్‌ ఆసుపత్రిలో చేరనున్నారు.

ఎమ్మెల్యేకి కరోనా నిర్ధారణ కావడంతో ఆయన కుటుంబసభ్యులకు పరీక్షలు నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలుస్తోంది. కాగా, రెండు రోజుల క్రితం జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డికి కూడా కరోనా పాజిటివ్ వచ్చింది. ఆయన ఓ కార్పొరేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

- Advertisement -