టీఆరెఎస్ పార్టీ ఆవిర్భవించి రెండు దశాబ్ధాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా నవంబర్ 29న వరంగల్ లో విజయ గర్జన సభ నిర్వహించెందుకు పార్టీ అధిష్టానం నిర్ణయించింది. వరంగల్ నగర పరిధిలోని దేవన్నపేట లో సుమారు 10లక్షల మందితో భారీ ఎత్తున సభను నిర్వహించి, విజయవంతం చేసేందుకు శ్రీకారం చుట్టారు.
అందులో భాగంగా 65వ డివిజన్ నాయకులు, కార్యకర్తలు, రైతులతో ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ గారు, వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ గారు సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే అరూరి రమేష్ మాట్లాడుతూ 20వసంతాలు పూర్తి చేసుకున్న సందర్బంగా టీఆరెఎస్ పార్టీ విజయగర్జన సభను పెద్ద ఎత్తున విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
స్థానిక రైతుల సహకారంతో సభాస్తలి ఏర్పాట్లు చేయాలని సూచించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటూ, రైతుల అంగీకారంతో సభ ఏర్పాట్లు చేయాలని తెలిపారు. సుమారు 10లక్షల మందితో నిర్వహించే విజయగర్జన సభను అన్ని హంగులతో నిర్వహించాలని అన్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ స్థాపించి 20వసంతాలు పూర్తవుతున్న సందర్భంగా పార్టీ సాధించిన విజయాలను, ప్రభుత్వం సాధించిన ప్రగతిని ముఖ్యమంత్రి కేసిఆర్ గారు పార్టీ శ్రేణులు, ప్రజలకు నివేదించునున్నట్లు ఎమ్మెల్యే అరూరి రమేష్ గారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కూడా చైర్మన్ మర్రి యాదవ రెడ్డి, ఎర్రబెల్లి ప్రదీప్ రావు, డివిజన్ నాయకులు, కార్యకర్తలు, రైతులు తదితరులు పాల్గొన్నారు.